మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:57 IST)

ఆస్తమా రోగులు తినాల్సినవి- తినకూడనివి

ఆస్తమా రోగులు చలికాలంలో పండ్లు తీసుకోవాలి. యాంటీ-యాక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా వుండే పండ్లు ఆస్తమాను నిరోధిస్తాయి. విటమిన్ సి, ఈ గల కివి, ఆరెంజ్‌ పండ్లను తీసుకోవచ్చు. ఆకుపచ్చని కూరగాయలు, ఆకు

ఆస్తమా రోగులు చలికాలంలో పండ్లు తీసుకోవాలి. యాంటీ-యాక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా వుండే పండ్లు ఆస్తమాను నిరోధిస్తాయి. విటమిన్  సి, ఈ గల కివి, ఆరెంజ్‌ పండ్లను తీసుకోవచ్చు.

ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం ఆస్తమా పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ డి గల పాలు, కోడిగుడ్లు, చేపలు తీసుకోవడం మంచిది. 
 
అలాగే శరీర బరువును నియంత్రించుకోవాలి. ఒబిసిటీకి ఆస్తమా రోగులు దూరంగా వుండాలి. అయితే జంక్ ఫుడ్స్‌ను శీతాకాలంలో ఆస్తమా పేషెంట్లు పక్కనబెట్టాలి. స్నాక్స్, ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఉప్పు అధికంగా గల పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. 
 
చైనీస్ ఫుడ్‌ను ఆస్తమా పేషెంట్లు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే మోనోసోడియమ్ గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) చైనా పదార్థాలు వుండటమే. ఇక సల్ఫైట్స్ అధికంగా వుండే వైన్, డ్రై ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్, ఊరగాయలు తీసుకోకపోవడం ద్వారా ఆస్తమా పేషెంట్లు శీతాకాలంలో ఏర్పడే రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు.
 
ఇక వీలైనంతవరకు శునకాలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిది. దుప్పట్లు. దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు తలకు మఫ్లర్ చుట్టుకోవడం మరవకండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.