శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (12:18 IST)

దొండకాయలతో మధుమేహం మటాష్

దొండకాయను వంటల్లో వాడుతూ వుంటాం. దొండలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దొండకాయలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. బి-కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకి మేలు చేస్తాయి. వారానికి ఒక్కసారైనా దొం

దొండకాయను వంటల్లో వాడుతూ వుంటాం. దొండలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దొండకాయలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. బి-కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకి మేలు చేస్తాయి. వారానికి ఒక్కసారైనా దొండకాయల్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుంది. ఎముక సాంద్రత పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది. 
 
దొండకాయలోని గుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకు రక్తంలో చక్కెర తగ్గించేందుకు దోహదపడుతుంది. తద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. దొండకాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మధుమేహం దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
దొండలోని బి-విటమిన్ నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. అల్జీమర్స్‌ను అడ్డుకుంటుంది. దొండకాయలోని రిబోప్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మానసిక ప్రశాంతతను ఇస్తుంది.  దొండలోని బీటా కెరోటిన్‌లు.. యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.