1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (16:30 IST)

బ్లాక్ టీని ప్రతిరోజూ తీసుకుంటే మేలేంటి?

black tea
ప్రతిరోజూ పాలతో తయారు చేసే టీ తాగడం వల్ల శరీరానికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే బ్లాక్ టీని ప్రతిరోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. శరీరానికి కావల్సిన అనేక ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బ్లాక్ టీలో వుండే పోషకాలు ఏంటో తెలుసుకుందాం. 
 
యాంటీఆక్సిడెంట్లు:
బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి ప్రతిరోజూ బ్లాక్ టీ తాగితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
 
గుండె ఆరోగ్యానికి మంచిది:
 బ్లాక్ టీని రోజూ తీసుకుంటే అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల గుండె కూడా ఆరోగ్యంగా మారుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
 
ఇది హార్ట్ స్ట్రోక్ సమస్యల నుండి కూడా గుండెను రక్షిస్తుంది. ఈ బ్లాక్ టీని ప్రతిరోజూ తాగితే అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
 ప్రతిరోజూ బ్లాక్ టీ తాగడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.