వంకాయలను లేతగా ఉన్నప్పుడే వండుకుని తినేయాలి.. ఎందుకు?
వంకాయల్లోని పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. వంకాయల్లోని విటమిన్ సి, ఇనుము నరాల బలహీనతకు చెక్ పెడతాయి. ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గును దూరం చేస్తాయి. టైప్-1 కిడ్నీ రాళ్లను కర
వంకాయల్లోని పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. వంకాయల్లోని విటమిన్ సి, ఇనుము నరాల బలహీనతకు చెక్ పెడతాయి. ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గును దూరం చేస్తాయి. టైప్-1 కిడ్నీ రాళ్లను కరిగించడంలో వంకాయలు భేష్‌గా పనిచేస్తాయి. వాత సంబంధిత రోగాలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, జలుబు, పిత్త వ్యాధులు, గొంతు నొప్పులు, ఒబిసిటీ దూరం కావాలంటే వంటల్లో వంకాయలు చేర్చుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వంకాయల్లోని యాంటీ-యాక్సిడెంట్లు కొవ్వును కరిగిస్తాయి. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. బ్రెయిన్ సెల్స్‌ను మెరుగ్గా పనిచేసేలా సహకరిస్తాయి. వంకాయలను లేతగా ఉన్నప్పుడే ఆహారంలో తీసుకోవాలి. ముదిరిన వంకాయలను అధికంగా తీసుకుంటే అలెర్జీలు తప్పవు. వంకాయలు క్యాన్సర్ కారకాలను కూడా దూరం చేస్తాయి. ఇందులోని ధాతువులు హృద్రోగ వ్యాధులను కూడా దరిచేరనివ్వవు.
శరీరంలో ఇనుము శాతాన్ని వంకాయలు క్రమబద్ధీకరిస్తాయి. వంకాయల్లోని విటమిన్ బి ఆకలిలేమిని దూరం చేస్తుంది. శ్వాస సమస్యలను నయం చేస్తుంది. టైప్-2 డయాబెటిస్‌ను రాకుండా నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు, హైబీపీని నియంత్రిస్తుంది. మానసిక ఆందోళనలను దూరం చేస్తుంది. కానీ అలెర్జీలు ఉన్నవారు వంకాయలను తినడం మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.