Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటకు 100 మైళ్ళ వేగంతో తుమ్ము... ఆపితే మరణమేనా?

చాలా మంది పిల్లలు లేదా పెద్దలు వచ్చే తుమ్మును బలవంతంగా ఆపుతుంటారు. నిజానికి తుమ్మితే "చిరంజీవ" అంటూ పెద్దలు దీవిస్తారు. పైగా, తుమ్మిన వెంటనే బయటికి పోవద్దని, కాసేపు ఆగి, నీళ్లు తాగివెళ్లాలని చెబుతున్న

Written By pnr
Updated: శనివారం, 7 జులై 2018 (15:42 IST)
చాలా మంది పిల్లలు లేదా పెద్దలు వచ్చే తుమ్మును బలవంతంగా ఆపుతుంటారు. నిజానికి తుమ్మితే "చిరంజీవ" అంటూ పెద్దలు దీవిస్తారు. పైగా, తుమ్మిన వెంటనే బయటికి పోవద్దని, కాసేపు ఆగి, నీళ్లు తాగివెళ్లాలని చెబుతున్నారు. కానీ, అదే పెద్దల్లో కొంతమంది ఆ తుమ్మును ఆపుతారు.  ఇలా చేయడం చాలా ప్రమాదమని వైద్యులు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
* తుమ్ము విషయంలో నిర్లక్ష్యంగా తగదని, తుమ్మును ఆపితే ప్రాణాంతకమంటున్నారు. 
* గంటలకు వంద మైళ్ల వేగంతో వచ్చే తుమ్మును బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉందని లీసెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. 
* లండన్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి ఇటీవల తుమ్మును ఆపేందుకు ముక్కు, రంధ్రాలు నోరు ఒకేసారి మూశాడు. 
* దీంతో తుమ్మవేగానికి అతడి గొంతులోపల రంధ్రం ఏర్పడింది. 
* ఆ తర్వాత గొంతు వాచిపోయి నొప్పి ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేరాడు. 
 
* పరీక్షలు చేయగా, గొంతులో రంధ్రం ఏర్పడిందని, గాలి బుడగలు.. వేగంగా వెళ్లి గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరాయని తేలింది. 
* ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే ప్రాణానికి ముప్పు వాటిల్లేదని వైద్యులు చెప్పారు. 
* తుమ్ముతో గాలి బలంగా ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే ప్రతికూల ప్రభావం ఉంటుంది. 
* తుమ్ములోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి దూసుకెళ్లి, వెంటనే మరణం సంభవించే అవకాశముంది. 
* రక్తనాళాలు కూడా పగిలిపోతాయి. కాబట్టి తుమ్ము ఆపొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

మాజీ బస్సు డ్రైవర్ నివాసంలో రూ.28.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారం.. లెక్కపెట్టేందుకే 18 గంటలు (video)

Gade Vijayalakshmi: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. లాయర్ కోగంటి రిత్వికకు నోటీసు

హనీమూన్ నేరం.. బెయిల్ రద్దు.. ట్రయల్ కోర్టు ముందు లొంగిన సోనమ్ రఘువంశీ

Heavy Rain: ఆదిలాబాదులో రైతులకు ఊరటనిచ్చిన భారీ వర్షాలు

జూలై 30, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

కాంతార రిషబ్ శెట్టికి అరుదైన అవార్డు.. ఆస్ట్రేలియాలో లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు

Vijay Deverakonda :తరుణ్ భాస్కర్ పై విజయ్ దేవరకొండ విమర్శ, ప్రశసలతో స్వీట్ పోస్ట్

కోయంబత్తూరులో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రామ్ చరణ్

Varun Tej: అభిమానుల పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్న వరుణ్ తేజ్

Sharwa : భోగి కోసం భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా

తర్వాతి కథనం
Show comments