బుధవారం, 6 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (15:01 IST)

ప్రతి రోజూ తలస్నానం చేయొచ్చా? కుంకుడుకాయలతో చేస్తే...

ప్రతిరోజూ తలస్నానం చేయొచ్చా? చేస్తే వెంట్రుకలు రాలిపోతాయా? అసలు ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదా? కాదా? అనే సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ఎక్కువ మంది ప్రతి రోజూ తలస్నానం చేసేందుకు ఇష్టపడతారు. ఇ

ప్రతిరోజూ తలస్నానం చేయొచ్చా? చేస్తే వెంట్రుకలు రాలిపోతాయా? అసలు ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదా? కాదా? అనే సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ఎక్కువ మంది ప్రతి రోజూ తలస్నానం చేసేందుకు ఇష్టపడతారు. ఇలా ప్రతి రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’ అని అంటుంటారు.
 
అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటుంది. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటుంటారు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుంది. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. 
 
అయితే, ప్రతి రోజూ తలస్నానం తప్పనిసరిగా చేయాలనుకునేవారు మాత్రం కుంకుడుకాయలులాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. తలవెంట్రుకలకి తగిన షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి వాష్‌ చేసుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు.