బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (21:20 IST)

జామ పండు వలన ఉపయోగాలెన్నో తెలుసా? (video)

వ్యాధినిరోధకతను సమకూర్చే ప్రాథమిక పోషకం ‘విటమిన్‌–సి’ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అది కావాలంటే మనందరికీ గుర్తొచ్చే పండ్లు నిమ్మజాతికి చెందిన ఒకింత పుల్లటి–తియ్యటి పండ్లు. కానీ... నారింజలో ఉండే విటమిన్‌–సి కంటే కూడా జామ లో ఉండే ‘విటమిన్‌–సి’ యే ఎక్కువ. అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో పొటాషియమ్‌ కూడా ఎక్కువ కాబట్టి రక్తపోటునూ సమర్థంగా నివారిస్తుంది.
 
అంతేకాదు... టొమాటోలో ఉన్నట్లే జామలోనూ లైకోపిన్‌ మోతాదులు చాలా ఎక్కువేనంటూ యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ పేర్కొంది. ‘లైకోపిన్‌’ అనే అద్భుత పోషకం... ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంటే... లైకోపిన్‌ ఉన్నందున ఈసోఫేజియల్‌ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో జామ దోహదపడుతుంది. 
 
కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్‌) చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తేలిగ్గా నివారితమవుతుంది. అలా వేళకు విసర్జన జరిగే ఈ ఒక్క జీవనశైలి మంచి అలవాటు కారణం గా ఎన్నెన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి. ఉజ్జాయింపుగా చూస్తే 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఎదిగే పిల్లలకూ ఇది చాలా మంచిది. ఇలాంటి అనేక గుణాలున్నందున దీన్ని ఆరోగ్యానికి ఖజానాగా పిలిచినా అతిశయోక్తి కాదు.