చేపల్లో వుండే పోషకాలు ఏమిటో తెలుసా? (Video)

సిహెచ్| Last Updated: సోమవారం, 29 జూన్ 2020 (17:15 IST)
నాన్ వెజ్ ఆహారంలో చేపలు కూడా ఒకటి. వీటిలో ఉత్తమ పోషకాలున్నాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తింటే మేలు జరుగుతుంది. చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం, అంతేకాదు ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి అందుతాయి.

ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా శరీరానికి అందుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం.

సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది.

దీనిపై మరింత చదవండి :