సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (12:24 IST)

నాజూగ్గా కనిపించాలంటే రోజుకు అరగంట కాదు.. పది నిమిషాలైనా నడవండి..

నాజూగ్గా కనిపించాలంటే.. వారానికి ఓ గంట వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే రోజుకో అరగంట వ్యాయామం కోసం కేటాయించాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వ్యాయామాన్ని ఒక్కసారిగా కాకుండా.. మెల్ల మెల్లగా అంటే మొదట

నాజూగ్గా కనిపించాలంటే.. వారానికి ఓ గంట వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే రోజుకో అరగంట వ్యాయామం కోసం కేటాయించాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వ్యాయామాన్ని ఒక్కసారిగా కాకుండా.. మెల్ల మెల్లగా అంటే మొదటి వారంలో గంట తీసుకోండి. మరుసటి వారం పది నిమిషాలు పెంచండి అలా పెంచుకుంటూ పోతే.. వ్యాయామంతో శరీరం దృఢపడుతుంది.. ఇంకా నాజూగ్గా తయారవుతారు. 
 
వ్యాయామం కింద నడక, యోగా, సైకిల్ ఏదైనా చేయొచ్చు. కనీసం ఇరవై నిమిషాల సమయాన్ని రోజూ వ్యాయామానికి కేటాయించగలిగితే ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం చేస్తుంటే వీలైనంతవరకూ ఉదయాన్నే వ్యాయామం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు. అరగంట కాకుంటే పది నిమిషాలైనా వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించడం మంచిది. 
 
తేలికపాటి వ్యాయామమే అయితే మీరు ఏమీ తినకుండా కూడా చేయొచ్చు. అలాకాకుండా కాస్త కఠినతరమైన వ్యాయమాలే చేస్తుంటే పోషకాహారాన్ని ఎంచుకోవడం మంచిది. అదీ వ్యాయామానికి గంట నుంచి మూడు గంటల ముందే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.