శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (16:15 IST)

కిడ్నీల్లో రాళ్లను తొలగించడానికి కలబందను తీసుకుంటే?

పెరట్లో పెరిగే కలబంద పెద్ద ఔషధాల నిధి అనే వాస్తవం ఈ నాటికి అందరికీ చేరలేదు. వాస్తవానికి కలబందలో జీవ కణాలకు పునరుజ్జీవింపచేసే అపారమైన శక్తి ఉంది. ఇది సుదీర్ఘకాలం జీవించేందుకు మనిషి ఆయుష్షును పెంచేందుకు

పెరట్లో పెరిగే కలబంద పెద్ద ఔషధాల నిధి అనే వాస్తవం ఈనాటికీ అందరికీ చేరలేదు. వాస్తవానికి కలబందలో జీవ కణాలకు పునరుజ్జీవింపచేసే అపారమైన శక్తి ఉంది. ఇది సుదీర్ఘకాలం జీవించేందుకు మనిషి ఆయుష్షును పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అనేక విటమిన్స్, ఎంజైములు, ప్రోటీన్స్, క్యాల్షియం, మానవ దేహానికి కావలసిన పోషకాలు కలబందలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కలబందను తీసుకోవడం వలన గుండె రక్తనాళాలు పరిశుభ్రమై గుండె జబ్బులు దూరమవుతాయి. కిడ్నీల్లో ఉండే రాళ్లను తొలగించడానికి కలబంద చాలా ఉపయోగపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. చెడు రక్తన్ని మంచి రక్తంగా మార్చుతుంది. జీర్ణవ్యవస్థలోని లోపాలను తొలగించడం ద్వారా ఆ వ్యవస్థ క్రమంగా జరుగుతుంది.
 
40 ఏళ్లు దాటిన వారిలో జీవకణాలు నశించిపోవడం ఎక్కువవుతుంది. ఆ కారణంగా నీరసం, నిస్సత్తువ, శరీరం తరచుగా రోగగ్రస్తం కావడం, అకాల వృద్ధాప్యం, మతిమరపు వంటి సమస్యలు తలెత్తుతాయి. కలబంద ఆ పరిణామాలకు తావు లేకుండా చేయడంతో పాటు జీవకణాలను చైతన్యవంతం చేస్తుంది.