మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:41 IST)

ప్రతిరోజూ దానిమ్మ పండును తీసుకుంటే?

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ-ట్యూమర్, విటమిన్ సి, ఎ, ఇ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని ఈ పండు రక్షిస్తుంది. ఎందుక

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ-ట్యూమర్, విటమిన్ సి, ఎ, ఇ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని ఈ పండు రక్షిస్తుంది. ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ కారణంగా తొందరగా వయసు మీదపడినట్లై ముసలి వాళ్లల్లా కనపడుతారు. అంతేకాకుండా బ్లడ్ ప్లేట్‌లేట్స్‌లో గడ్డలు ఏర్పడకుండా దానిమ్మ కాపాడుతుంది.
 
గుండె జబ్బులు, ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. రక్తంలో అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. దానిమ్మలో పోషకాలు, పీచు పదార్థం అధికంగా ఉన్నాయి. వీటి వలన జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. దానిమ్మలో గల విటమిన్ సి, కె, పొటాషియం వంటి ఖనిజాలు జ్ఞాప్తకశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. 
 
డయేరియా, నీళ్ల విరేచనాలను తగ్గించుటలో దానిమ్మ చక్కగా పనిచేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ప్రీ నేటల్-కేర్ సమయంలో దానిమ్మరసం తీసుకోవడం చాలా మంచిది. యాంటీ-ఏజింగ్ గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. చర్మ క్యాన్సర్‌ని నిరోధిస్తుంది. ప్రతిరోజూ దానిమ్మ జూస్ తీసుకోవడం వలన జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.