మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (10:15 IST)

నీళ్లే కదా.. తాగితే ఎంత... తాగకపోతే ఏంటి..?

ఆ నీళ్లే కదా.. తాగితే ఎంత... తాగకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటారు. శరీరంలో ఎక్కువశాతం నీరే ఉంటుంది. ఈ నీరే ప్రాణాధారం. శరీరానికి తగినంత నీరు అందివ్వడంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న పలురకాల విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి. నీరు తక్కువగా తీసుకోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. 
 
శరీరంలో చేరుకునే రకరకాల జబ్బులను నీరు పారద్రోలుతుంది. కాబట్టి శరీరానికి తగినంత నీరు అందిస్తుండాలి. శరీర బరువును నియంత్రించేందుకు నీరు ఓ దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. అలానే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తొలగించే గుణం ఇందులో ఉంది. నీటిని సేవించడం వలన ఎక్కువ క్యాలరీలు కలిగిన సోడా, డ్రింక్స్, మద్యం, ఇతర జ్యూస్‌లను త్రాగాలనిపించదు. 
 
శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. నీటితో శరీరంలో శక్తి వస్తుంది. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు అలసట కలుగుతుంది. దీంతో శరీరంలో శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. తరచు గొంతు ఎండిపోవడం, కొందరిలో కళ్ళు తిప్పడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అలసట కారణంగా కొందరిలో బలహీనత ఏర్పడుతుంది. 
 
ఆరోగ్యకమైన చర్మం కోసం నీటిని ఎక్కువగా సేవించాలంటున్నారు వైద్యులు. తగిన మోతాదులో నీరు తీసుకుంటుంటే చర్మంలో నిగారింపు కనపడుతుంది. ఇది ఒక్కరోజులోనే జరగదంటున్నారు వైద్యులు. దీనికి నిత్యం నీటిని సేవిస్తుండాలి. అప్పుడే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.