శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:25 IST)

వేప వేరు కషాయం.. నడుమునొప్పిని అడ్డుకుంటుంది

నడుము నొప్పి ఎలా వస్తుదంటే.. వెన్నెముక మధ్య ఉండే డిస్కు ఒత్తిడికి గురైనపుడు అది వెన్నుపామును నొక్కుతుంది అప్పుడే నడుమునొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేపాకులను ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఈ వేప వేరుతో కషాయం ఎలా చేయాలో చూద్దాం. వేప వేరును నీటితో నూరుకుని తీసుకున్నా లేదా కషాయం రూపంలో తాగినా నడుమునొప్పి వెంటనే తగ్గుముఖం పడుతుంది. కరక్కాయ చూర్ణాన్ని ఆముదంలో కలిపి సేవిస్తే కూడా నడుమునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
శొంఠి, పల్లేరులో కషాయం తయారుచేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే నడుమునొప్పి వంటి సమస్యలు దరిచేరవు. తిప్ప తీగ చూర్ణ, శొంఠి కషాయాన్ని తాగితే కీళ్ల నొప్పులు, శరీర వాపులు తొలగిపోతాయి. పల్లేరు చూర్ణాన్ని 15 రోజులు క్రమంగా తప్పకుండా తీసుకుంటే ఎముకల బలంగా ఉంటాయి. అలానే శొంఠి కషయాన్ని ఆముదంలో కలుపుకుని సేవిస్తే నడుమునొప్పి తగ్గుతుంది.