బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 నవంబరు 2024 (16:22 IST)

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

cheese puffs
ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ చీజ్ పఫ్ అంటే కొందరు లొట్టలేసుకుని తింటుంటారు. కానీ వీటిని మోతాదుకి మించి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
చీజ్ పఫ్స్‌ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఊబకాయం కూడా వస్తుంది.
చీజ్ పఫ్‌లలో ఉప్పు ఎక్కువగా వుంటుంది కనుక ఇది అధిక రక్తపోటుకు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
వీటిలో సంతృప్త కొవ్వులు వుండటం వల్ల ఇవి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
చీజ్ పఫ్ కరకరలాడే స్నాక్స్ కనుక వీటిని ఎవరైనా అతిగా తినేస్తారు, ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తుతుంది,
ఎక్కువ మొత్తంలో ప్రాసెస్ చేసిన చీజ్ పఫ్స్ వంటి స్నాక్స్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి
చీజ్ పఫ్స్ తినేవారిలో మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.