ganesh chaturthi

జీర్ణవ్యవస్థ నిరంతరం ఇబ్బంది లేకుండా పనిచేయాలంటే...?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 8 మార్చి 2019 (22:17 IST)
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే భోజనం తరువాత కొన్ని పనులకు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అలా చేస్తే అరుగుదల బాగా జరుగుతుందట. అంతేకాదు జీర్ణవ్యవస్థ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదట. కొందరు రాత్రిపూట భోజనం చేశాక స్నానం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటిరెండుసార్లు చేయొచ్చు. అదే అలవాటుగా మారితే స్నానం వల్ల కదలికలు వేగంగా ఉంటాయట.
 
ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ మీద పడుతుందట. అరుగుదల మందగిస్తుంది. షవర్‌తో స్నానం చేయడం అస్సలు మంచిది కాదట. నీళ్ళు తాగడం వల్ల ఒత్తిడి జీర్ణవ్యవస్ధపై పడుతుంది. అన్నం తిన్నాక కాసేపు అలా ఇలా నడుస్తూ ఉండాలట. అలాగని ఎక్కువసేపు నడవడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కొంతమంది వికారం కలగవచ్చు. మరికొందరికి పొట్టలో తిప్పే ప్రమాదం ఉందట. 
 
భోజనం చేశాక రాత్రి పూట చల్లటి నీళ్ళు తాగితే అరుగుదల మీద ప్రభావం చూపుతాయట. అదే గోరువెచ్చని నీళ్ళు తాగితే జీర్ణవ్యవస్ధ పనితీరును వేగవంతం చేస్తాయట. భోజనం చేసిన తరువాత తినడం మంచిది కాదు. తినడానికి..పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలట. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేశాక టీ, కాఫీలు అస్సలు తాగకూడదట. అలా తాగితే పోషకాహారాలు వంటబట్టవని చెపుతున్నారు.

అన్నీ చూడండి

TG Assembly: బీఆర్ఎస్ పాలనలో ఎన్టీఆర్‌కు భూమి కేటాయింపులు జరిగాయ్

ప్రధాని మోడీ 76వ పుట్టినరోజు - 76 వంటకాలతో వినూత్నంగా శుభాకాంక్షలు

మరో యువతితో కనిపించిన ప్రియుడు.. నిలదీసినందుకు ప్రియురాలిని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు (వీడియో)

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండనే ఉండదు : కేటీఆర్

సెప్టెంబర్ 17, 2026 నాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా వుంది..?

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments