మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (12:14 IST)

కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. వీర్యవృద్ధికి కుసుమ గింజల్ని?

కొలెస్ట్రాల్‌ను కరిగించాలంటే.. కుసుమ గింజల్ని వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజల్లో సన్‌ఫ్లవర్‌లోకన్నా లినోలిక్‌ ఆమ్లం చాలా ఎక్కువ. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అనేక పరిశోధనల్లో తేలింది. విటమిన్‌-ఇ కూడా ఎక్కువే. ఆస్తమా ఎగ్జిమా వంటి వ్యాధుల్ని నిరోధించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
 
అరటీస్పూను కుసుమగింజల పొడిలో తేనె వేసుకుని రోజూ రెండుసార్లు తీసుకుంటే ఆస్తమా తగ్గుతుందట. వీటిని కాసిని పిస్తా, బాదం, తేనెతో కలిపి రోజూ రాత్రిపూట తింటే పురుషుల్లో వీర్యవృద్ధి ఉంటుంది. సంతానలేమితో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మేలు. అలాగే పొద్దుతిరుగుడు గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఇది కొవ్వుని కరిగించడంతోబాటు గుండెజబ్బులకీ ఆర్థ్రయిటిస్‌, ఆస్తమా వ్యాధులకీ కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తుంది. మెనోపాజ్‌లో వీటిని తింటే మధుమేహం తలెత్తే సమస్య తగ్గుతుంది. ఈ గింజల్లోని లినోలిక్‌ ఆమ్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎముకల వృద్ధికీ నరాల పనితీరుకీ తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.