శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (13:37 IST)

మాఘ పౌర్ణమి రోజున ఇలా చేస్తే..?

మాఘ మాసంలోని విశేషమైన రోజుల్లో ''మాఘ పౌర్ణమి'' ఒకటి. దీనినే ''మహా మాఘి'' అని అంటారు. ఈ రోజున చేసే స్నాన, దాన, జపాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కాలువల్లో, చెరువుల్లో, బావుల్లో, నదుల్లో చేసే స్నానం ఎంతో పుణ్యప్రదం. ఇక సముద్ర స్నానం మరింత విశేషం.


సముద్ర స్నానం అనేక జన్మల పాపాలను హరించి వేసి, పుణ్య ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈ రోజున స్నాన, దాన, జపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సాక్షాత్తు ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. 
 
మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాలు వల్ల వ్యాధులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ''గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు" అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి. 
 
ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు, దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తోంది.