ఆలివ్ నూనె, కోడిగుడ్డు తెల్లసొనతో చుండ్రుకు చెక్
సాధారణంగా మనలో చాలా మంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం, వాతవరణంలో వేడి, వల్ల జుట్టు అధికంగా రాలే సమస్య ఒకటైతే, చుండ్రు మరో ప్రధాన సమస్య. స్త్రీలలో కంటే పురుషుల
సాధారణంగా మనలో చాలా మంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం, వాతవరణంలో వేడి, వల్ల జుట్టు అధికంగా రాలే సమస్య ఒకటైతే, చుండ్రు మరో ప్రధాన సమస్య. స్త్రీలలో కంటే పురుషుల్లో చుండ్రు సమస్య ఎక్కువ. చమురు గ్రంథులు పురుషులకు ఎక్కువ, తల మీద గ్రంథులపై హార్మోన్ ప్రభావం కూడా పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. యుక్త వయస్సులో మన ఒంట్లో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతో తల మీది చమురు గ్రంథులు ఎక్కువ పని చేసి చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.
షాంపూలు అధికంగా వాడటం, వాటిని సరిగా కడుక్కోకపోవటం, బలంగా ఒత్తిపెట్టి దువ్వటం, జుట్టు షేప్ చేసుకోవడానికి డ్రైయర్లు వాడటం, నూనె, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి కూడా చుండ్రు ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసం వేపాకుల్ని నూరి ముద్దగా చేసుకొని కప్పు పెరుగులో కలుపుకోవాలి. దానికి రెండు చుక్కల ఆలివ్ నూనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలుపుకొని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేసుకోవాలి.
ఇలా వారానికోసారి చేస్తుంటే త్వరలోనే సమస్య దూరమవుతుంది. మెంతులను నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. కలబంద రసానికి కొద్ది ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి.
ఈ మిశ్రమం వల్ల తలను చాలా కూల్‌గా చేస్తుంది. అంతేకాదు దురదను కూడా నివారిస్తుంది. 2 గుడ్లను తీసుకొని, అందులో కొద్దిగా నిమ్మ, ఉల్లిపాయ రసాలు మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.