బరువును తగ్గించే ఉలవల పొడి.. మొలకెత్తిన ఉలవల్ని తీసుకుంటే? (Video)
రోజూ ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో వున్న అనవసరపు కొవ్వు కరిగిపోతుంది. రోజూ ఓ కప్పు ఉలవలను నీటిలో నానబెట్టి.. పరగడుపున తీసుకుంటే ఒబిసిటీ దూరం అవుతుంది. ఉలవల రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర బరువును తగ్గించడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా చేయడంలో ఉలవలు బెస్ట్.
శరీరంలో వున్న ట్యాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులో వుండే పిండి పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయి. ఉలవల్ని తీసుకుంటే కడుపునిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆహారాన్ని మితంగా తీసుకోవడం జరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారని వైద్యులు చెప్తున్నారు. ఉలవలను బాగా నీటిలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా జలుబు నయం అవుతుంది.
శరీర అవయవాలను బలపరిచే శక్తి ఉలవలకు వుంది. మహిళల్లో నెలసరి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ప్రసవానికి అనంతరం ఉలవలను మహిళలు తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ఉలవలను వేయించి పొడి చేసుకుని సీసాలో భద్రపరుచుకోవాలి. ఒక గ్లాసుడు నీటిలో జీలకర్రను, ఉలవల పొడిని వేసి మరిగించి ఆ నీటిని పరగడుపున తీసుకుంటే ఒక మాసంలో ఐదు కేజీల వరకు బరువును తగ్గించుకోవచ్చు.
అలాగే పరగడుపున మొలకెత్తిన ఉలవలను గుప్పెడు తీసుకుంటే.. అజీర్తి సమస్యలుండవు. ఉలవలు లేదా ఉలవల ద్వారా తయారయ్యే పదార్థాలను తీసుకోవడం ద్వారా మధుమేహం దూరం అవుతుంది. ఉలవలలోని పీచు పదార్థాలు రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.