బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (20:45 IST)

శృంగారం గురించి మహిళ రోజుకి ఎన్నిసార్లు ఆలోచన చేస్తుంది?

శృంగారం అనేది మనిషి జీవితంలో ఓ భాగం. శృంగారంతో మనిషి శారీరకంగా, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చురుకుగా ఉంటూ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయితే శృంగారం - ఆహారం మధ్య కొంత మీమాంస నెలకొని వుంది. వీటి నివృత్తిపై అనేక రకాలైన పరిశోధనలు జరిగాయి. 
 
ఆహారం - శృంగారం అనే రెండు విషయాలపై మహిళల ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయన్నదానిపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లండన్‌కు చెందిన ఓ అధ్యయన బృందం 950 మంది మహిళలపై సర్వే చేపట్టింది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో సుమారు 70 శాతం ఎక్కువగా తిండి గురించే ఆలోచన చేసినట్లు వెల్లడైంది. అదేవిధంగా వారిలో 58 శాతం మాత్రమే శృంగారం గురించి ఆలోచన చేసినట్లు తేలింది. 
 
మహిళలు ఒక రోజులో శృంగారం గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తారు...? అని చూసినప్పుడు 24 గంటల్లో కనీసం 10సార్లు శృంగారం సంబంధిత ఆలోచనల్లో ఉంటారని తేలింది. ఇక భోజనం విషయానికి వస్తే సుమారు 15 నుంచి 20 సార్లు తమ దృష్టిని తిండిపైకి మరలిస్తున్నట్లు వెల్లడైంది. ఎప్పుడు ఏది తినాలా...? అనే ఆలోచనలో ఎక్కువ శాతం మహిళలు మునిగి ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.