బరువును తగ్గించే మంగుస్తాన్.. నాజూకైన నడుము కోసం.. వారానికి..?
మాంగోస్టీన్ లేదే మంగుస్తాన్ అనే పండులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. రుచితో ఇది పుల్లగా, తీయగా ఉంటుంది. హిందీలో మంగుస్తాన్ అని ఈ పండును పిలుస్తారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జలుబు, దగ్గు వంటి సమస్యలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మ్యాంగోస్టీన్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండు మహిళల్లో రుతుస్రావ సమస్యలను తగ్గించడంలో కూడా సాయపడుతుంది. ఈ పండును తీసుకుంటే బరువు తగ్గుతారు.
మాంగోస్టీన్‌లో సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది. ఇందులో థయామిన్, నియాసిన్, ఫోలేట్ మాంగోస్టీన్‌లో అధిక మొత్తంలో కనిపిస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు మొదలైన వాటి పెరుగుదలను మార్చే పనిలో ఈ విటమిన్లు చాలా సహాయపడతాయి. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలకు ఈ పండు చెక్ పెడుతుంది.
అందువల్ల, మాంగోస్టీన్ పండ్లను ప్రతిరోజూ లేదా కనీసం వారానికి రెండుసార్లు తీసుకోవడం కంటి చూపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు లేదా నడుము భాగాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి మాంగోస్టీన్ పండు గొప్ప వరం. మూడు వారాల పాటు రోజుకు ఒకసారి మాంగోస్టీన్ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.