శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 నవంబరు 2023 (18:11 IST)

చింత చిగురు వస్తే వదలిపెట్టకుండా తినేయండి, ఎందుకంటే?

చింత చిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
చింత ఆకుల మిశ్రమం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు.
 
చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
 
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో చింతచిగురు మేలు చేస్తుంది. చింతాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నాయి కనుక ఇవి కీళ్ల నొప్పులను నయం చేస్తాయి.