బాదంపప్పుతో మానసిక ఒత్తిడి, గుండె, నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలు మెరుగు

Baadam
సిహెచ్| Last Modified బుధవారం, 9 సెప్టెంబరు 2020 (20:34 IST)
హృదయ సంబంధ వ్యాధులు (సీవీడీ) ప్రమాదానికి దోహదం చేస్తుందని భావించే మానసిక అంశాలలో మానసిక ఒత్తిడి కూడా ఉంది. హృదయ స్పందనల నడుమ వ్యవధిలో హెచ్చుతగ్గుల కొలత అయిన హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీ (హెచ్‌ఆర్‌వీ)అనేది ఒత్తిడికి సంబంధించి కార్డియోవాస్క్యులర్‌ వ్యవస్థ యొక్క ప్రతిస్పందనకు ఒక ముఖ్యమైన సూచికగా ఉంటుంది.

శారీరక శ్రమ, డైట్‌ సహా జీవనశైలి అంశాలు సైతం హెచ్‌ఆర్‌వీని ప్రభావితం చేస్తాయని భావన. పర్యావరణ మరియు మానసిక సవాళ్లకు ప్రతిస్పందనగా గుండె యొక్క ఎక్కువ అనుకూలతను అధిక హెచ్‌ఆర్‌వీ సూచిస్తుంది. అదే సమయంలో అతి తక్కువ హెచ్‌ఆర్‌వీ కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, ఆకస్మిక కార్డియాక్‌ మరణాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఇటీవలి కాలంలో నిర్వహించిన క్లీనికల్‌ ట్రయల్స్‌లో భాగంగా కింగ్స్‌ కాలేజీ లండన్‌లోని పరిశోధకులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో హెచ్‌ఆర్‌వీని పరిశీలించారు. సంప్రదాయ స్నాక్స్‌కు బదులుగా బాదములను ఆరు వారాల పాటు తీసుకున్న వారిలో హెచ్‌ఆర్‌వీ ప్రమాణాలు వృద్ధి చెందినట్లుగా కనుగొన్నారు. ఈ అధ్యయనానికి ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నిధులను అందించింది.

ఈ నూతన అధ్యయన ఫలితాలను అట్టిస్‌ అధ్యయనంలో భాగంగా విడుదల చేశారు. ఆరువారాల పాటు యాథృశ్చిక నియంత్రణ, ప్యారలల్‌ ఆర్మ్‌ ట్రయల్‌ చేశారు. దీనిలో సరాసరికన్నా అధిక కార్డియోవాస్క్యులర్‌ వ్యాధుల ప్రమాదం ఉన్న వారికి ప్రతి రోజూ బాదములను స్నాక్‌గా అందించడం లేదా కేలరీలను సరిపోయే రీతిలో నియంత్రితంగా స్నాక్స్‌ను ప్రతి పార్టిస్పెంట్‌ ప్రతిరోజూ శక్తి అవసరాలకు తగినట్లుగా 20% అందించడం జరిగింది.

ఈ అధ్యయనంలో, పరిశోధకులు వాస్తవ సమయంలో వారి యొక్క హార్ట్‌రేట్‌ (హెచ్‌ఆర్‌) మరియు హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీ (హెచ్‌ఆర్‌వీ)ను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు (5 నిమిషాల కోసం పడుకున్నప్పుడు) మరియు స్ట్రూప్‌ టెస్ట్‌ (దీనిలో అభ్యర్థులకు రంగులతో కూడిన పదాలను చదువమని కోరతారు. ఉదాహరణకు గ్రీన్‌ ఫాంట్‌లో ఎరుపు అని)ను స్వల్పకాలం పాటు మానసిక ఒత్తిడి కోసం చేస్తారు.

తీవ్రమైన మానసిక ఒత్తిడి వేళ, బాదముల గ్రూప్‌లోని వారిలో అత్యుత్తమ హార్ట్‌ రేట్‌ రెగ్యులేషన్‌ను నియంత్రిత గ్రూప్‌తో పోల్చినప్పుడు చూశారు. బీట్‌ నుంచి బీట్‌ నడుమ సమయాన్ని గుణించడానికి ప్రత్యేకమైన (హెచ్‌ఆర్‌వీని కనుగొనే విధానం)అత్యధిక ఫ్రీక్వెన్సీ శక్తిలో గుణాత్మకంగా ముఖ్యమైన తేడాలను సూచించింది.

‘‘సంప్రదాయ స్నాక్‌కు బదులుగా బాదములను తీసుకోవచ్చనే అతి సాధారణమైన ఆహార వ్యూహం, హృదయ స్పందన రేటు నియంత్రణను మెరుగుపరచడం ద్వారా మానసిక ఒత్తిడి యొక్క ప్రతికూల హృదయ నాళ ప్రభావాలను పెంచుతుందని చూపించింది. ఆహార పరంగా మార్పులు చేసిన తరువాత నియంత్రణ గ్రూప్‌తో పోలిస్తే బాదముల గ్రూప్‌లో హృదయ స్పందన రేటు పరంగా ఒత్తిడి- ప్రేరిత తగ్గింపు జరిగిందని మేము కనుగొన్నాము. ఇది హృదయ ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుంది.

శరీరంలో ఉన్న డిమాండ్లకు అనుగుణంగా గుండె వేగంగా గేర్‌లను మార్చగలగడం వల్ల అత్యధిక హెచ్‌ఆర్‌వీ ఉండటం ఉపయుక్తంగా భావించడం జరుగుతుంది. ఒత్తిడి సమయంలో
గుండె త్వరగా పరిస్థితులను ఆకలింపు చేసుకోవడంతో పాటుగా వశ్యతతోనూ ఉండగలదు. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని డాక్టర్‌ వెండీ హాల్‌, పీహెచ్‌డీ, కో-ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ (డాక్టర్‌ సారా బెర్రీ, పీహెచ్‌డీతో కలిసి అధ్యయనం చేశారు) మరియు రీడర్‌-న్యూట్రిషనల్‌ సైన్సెస్-కింగ్స్‌ కాలేజీ-లండన్‌ అన్నారు.

ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం సంప్రదాయ స్నాక్స్‌కు బదులుగా బాదములను తినడం వల్ల మానసిక ఒత్తిడి వల్ల హెచ్‌ఆర్‌వీలో ఒడిదుడుకులను తగ్గించడంతో పాటుగా కార్డియాక్‌ పనితీరు మెరుగుపరుస్తుంది. ఈ డైటరీ వ్యూహానికి మానసిక ఒత్తిడికి తగినట్లుగా కార్డియోవాస్క్యులర్‌ ఆరోగ్యం మెరుగుపరిచే సామర్థ్యం ఉంది. దీనితోపాటుగా ఇతర గుండె ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయి. బాదములను ఆరగించడం వల్ల ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గడంతో పాటుగా రక్తనాళాల పనితీరు కూడా వృద్ధి చెందుతుంది.

‘‘ఇంటి నుంచి పనిచేయడం మరియు వృద్ధి చెందిన స్నాకింగ్‌ సమయంలో మనలో చాలామంది అనుభవిస్తున్న ఒత్తిడి తీవ్రమైన వేళ ఈ ఫలితాలు సరైన సమయంలోనే వచ్చాయి’’ అని డాక్టర్‌ సారా బెర్రీ, పీహెచ్‌డీ, కింగ్స్‌ కాలేజీ లండన్‌ అన్నారు. ఈ నూతన అధ్యయనం, అట్టిస్‌ ట్రయల్‌లో భాగం. అట్టిస్‌ ఇటీవలనే విడుదల చేసిన అధ్యయనంలో బాదములు తినడం వల్ల ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిపై పడుతున్న ప్రభావం పరీక్షించారు. దీనితో పాటుగా ఎండోథిలియం ఆధారిత వాసోడియలేషన్‌ (ఫ్లో మెడిటేటెడ్‌ డయలేషన్‌ లేదా ఎఫ్‌ఎండీ ద్వారా కనుగొన్నారు)ను పరీక్షించారు. కార్డియోవాస్క్యులర్‌ వ్యాధుల ప్రమాద తీవ్రత అంచనా కోసం దీనిని చేస్తారు.

ఈ అధ్యయన ఫలితాలను గురించి షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘ఈ
అధ్యయన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మరియు సంబంధితంగానూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పలువురు భారతీయులు అత్యధిక ఒత్తిడిని ప్రస్తుత మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్నారు. ఈ పరిశోధన వెల్లడించే దాని ప్రకారం ఒకరు తమ డైటరీ వ్యూహాన్ని మార్చుకోవడంతో పాటుగా బాదములను తమ డైట్‌లో జోడించడం వల్ల మానసిక ఒత్తిడి వేళ కూడా కార్డియోవాస్క్యులర్‌ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. దానితో పాటుగా ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ సైతం తగ్గి, రక్తనాళాల యొక్క ఎండోథలియల్‌ పనితీరు మెరుగవుతుంది (ఇతర అధ్యయనాలలో సూచించినట్లుగా). అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా బాదములు తీసుకుంటే, సీవీడీ ప్రమాదంతో ఉన్న లేదంటే ఆ ప్రమాదంలో ఉన్న వారు తమ జీవితాలలో ఆరోగ్యవంతమైన మార్పును చూడగలరు’’ అని అన్నారు.దీనిపై మరింత చదవండి :