బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (18:42 IST)

సింపుల్ అండ్ సూపర్ స్నాక్స్.. ఫ్రైడ్ నట్స్.. ఎలా చేయాలంటే?

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఆప్రికాట్స్, డేట్స్ వీటన్నింటిని కూడా నట్స్ కిందకే వస్తాయి. ఇందులో ఒక్కో నట్స్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎంతో రుచిగా ఉండే ఈ నట్స్ మంచి న్యూట్రీషియన్స్ వాల్యూస్ కలిగి ఉంటాయి. నట్స్ తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. మెమరీ పవర్ పెరుగుతుంది.

అందుకే రెగ్యులర్‌గా తీసుకోవాలి. వీటిల్లో ముఖ్యంగా బాదం తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. శరీరంలోని పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడంలో పప్పుదినుసులు బాగా పనిచేస్తాయి. వీటిలోని ఫొలేట్, మెగ్నీషియం, పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అందుకే నట్స్‌తో ఈ సింపుల్ అండ్ సూపర్  స్నాక్స్ రిసీపీ చేసేద్దాం.. 
 
ఎలా చేయాలంటే.. ? రోడ్ సైడ్ ఫుడ్ తినాలనుకునే వారిక ఫ్రైడ్ నట్స్ ట్రై చేయండి. మీకు నచ్చిన నట్స్ కొనుక్కోవాలి. తర్వాత పాన్ తీసుకొని ఆయిల్ పోసి వేడి చేసి.. అందులో నట్స్‌ను ఆలివ్ ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆపై తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా తరుగు చేర్చి.. వేడి వేడిగా సాస్‌తో  ఫ్రైడ్ నట్స్‌ను టేస్ట్ చేస్తే యమ్మీగా వుంటుంది. రోజూ ఆఫీసుకు ఈ ఫ్రైడ్ నట్స్‌ను స్నాక్స్ సమయంలో టేస్టు చేస్తే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఒబిసిటీని దూరం చేసుకునే వీలుంటుంది.