శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:59 IST)

ఇవి అంత తేలిగ్గా జీర్ణం కావు... అందుకే కాస్త చూసుకుని తినాలి

మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని జీర్ణం కావడానికి చాలా ఇబ్బందిగా వుంటుంది. అలాంటి పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే కానీ అవి అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండె మంటను కలిగిస్తాయి.
 
బాగా వేయించిన వేపుడు పదార్థాలు అజీర్ణం కలిగిస్తాయి. నూనెలో వేయించిన ఆహారాలు చాలా కష్టంగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే వాటిలో అధిక నూనె వుంటుంది. అంతేకాక బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు అనారోగ్య నూనె లేదా బాగా మరిగిన నూనె అనేక మార్లు ఉపయోగించటం చేస్తారు. అది మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది.
 
కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. ఎందుకంటే, అవి త్వరగా జీర్నం కావు. వీటిలో ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలు జీర్ణం చేయటానికి అవసరమైన లాక్టేస్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో బాక్టీరియా బలపడుతుంది.
 
లాక్టోస్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. ఇది పాల ఉత్పత్తి. సాధారణంగా 70 శాతం పెద్ద వారికి ఎంతో కొంత లాక్టోస్ సరిపడకపోవటం వుంటుంది లేదా లాక్టోస్ కల ఆహారాలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది.