బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (14:10 IST)

ఆలివ్ ఆయిల్ వాడితే.. మధుమేహం పరార్..

ఆలివ్ ఆయిల్‌ను వాడటం ద్వారా మధుమేహం పరార్ అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆలివ్ నుంచి సేకరించిన రసాయన పదార్థం ఒలెయురోపీన్ శరీరం మరింత ఎక్కువగా ఇన్సులిన్ స్రవించేలా చేస్తుందని.. తద్వారా మధుమే

ఆలివ్ ఆయిల్‌ను వాడటం ద్వారా మధుమేహం పరార్ అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆలివ్ నుంచి సేకరించిన రసాయన పదార్థం ఒలెయురోపీన్ శరీరం మరింత ఎక్కువగా ఇన్సులిన్ స్రవించేలా చేస్తుందని.. తద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
గుండె ధమనుల పనితీరుకు అడ్డంకిగా మారే కొవ్వును తొలగించి.. ధమనుల రక్తప్రసరణలను మరింతగా పెంచుతుంది. తద్వారా ధమనుల రక్తప్రసరణ మరింతగా మెరుగుపడుతుంది. ఆలివ్ ఆయిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందింపజేస్తుంది. ఆలివ్ నూనెలోని విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్లు.. చర్మాన్ని తేమగా వుంచుతాయి. 
 
ఇవి ముడతలను తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. మచ్చలను, మొటిమలను తేలికగా తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని, మృదువుగా మార్చి, చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. అలాగే పెదవులను పింకీగా మారుస్తాయి. ఆలివ్ ఆయిల్, జుట్టుకు కావలసిన పోషణను అందించి, జుట్టును తేమగా ఉంచుతుంది. చుండ్రును పోగొట్టి, జుట్టును మరింతగా బలపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.