శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (08:57 IST)

మాజీ ప్రధాని అటల్ జీ ఆరోగ్యం ఎలా ఉందంటే...

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. గత కొన్నేళ్లుగా అనారోగ్యంగా ఉంటూ వచ్చారు. అయితే, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. గత కొన్నేళ్లుగా అనారోగ్యంగా ఉంటూ వచ్చారు. అయితే, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్నారు.
 
ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని రెండుమూడు రోజుల క్రితం వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఓ మెడికల్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఈ బులిటెన్ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. 
 
ఆయన పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని వెల్లడించారు. కాగా, కిడ్నీ సంబంధిత సమస్య, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లతో వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరిన విషయం తెల్సిందే.