సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (14:54 IST)

ఢిల్లీ ఎయిమ్స్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి.. ఆందోళన అక్కర్లేదట...

మాజీ ప్రధానమంత్రి ఏబీ వాజ్‌పేయిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఆయనను రొటీన్ చెకప్, పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మాజీ ప్రధానమంత్రి ఏబీ వాజ్‌పేయిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఆయనను రొటీన్ చెకప్, పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఆయనకు ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ డాక్టరు రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్ పేయికి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, సుమారు మూడు దశాబ్దాలుగా వాజ్‌పేయికి వ్యక్తిగత ఫిజీషియన్‌గా రణ్‌దీప్ వ్యవహరిస్తున్నారు.
 
కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 93 సంవత్సరాల వాజ్‌పేయి బయటకు రావడం లేదు. పార్టీ‌కి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనని విషయం తెల్సిందే.
 
ఇదిలావుంటే, 1924లో జన్మించిన వాజ్‌పేయి 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. లక్నో లోక్‌సభ స్థానం నుంచి 1991, 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 
 
బీజేపీ నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి వాజ్‌పేయి. అతి తక్కువకాలం ప్రధానిగా కూడా కొనసాగింది ఆయనే. 2015లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఆయనకు ప్రదానం చేసింది.