గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (17:26 IST)

బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి చిన్నారులకు తినిపిస్తే?

బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాల మీద పెట్టడం వల్ల అని త్వరగా తగ్గుతాయి. బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకి దోహదపడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. అలాగే నిద్రలేమికి

బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాల మీద పెట్టడం వల్ల అని త్వరగా తగ్గుతాయి. బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకి దోహదపడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. అలాగే నిద్రలేమికి చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహం వ్యాధి ఉన్న వారికి బొప్పాయి పండు చక్కగా ఉపయోగపడుతుంది. చక్కెర శాతం పెరగకుండా కాపాడుతుంది.
 
బొప్పాయి పండులో బీటా కెరోటిన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. పోటాషియం, పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితంగా హృద్యోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ. బొప్పాయిలో కోలిన్ అనే పదార్థం ఉండడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
 
ఇంకా బొప్పాయి పండులో పోషకాలూ పుష్కలంగానే ఉంటాయి. అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. 
 
బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి.