శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (18:26 IST)

రోజా రేకులు తింటే బరువు తగ్గిపోతుందట.. ఇంకా వీర్యవృద్ధికి? (video)

రోజా పువ్వుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. రోజా పూలలో విటమిన్ సి పుష్కలంగా వుంది. రోజా పూల రేకులకు సూక్ష్మక్రిములను తరిమికొట్టే శక్తి వుంది. రోజా పువ్వుల్లోని వాసన ఒత్తిడిని మాయం చేస్తుంది. ఒత్తిడిలో వుండే వారు రోజ్ పువ్వులను వాసన చూస్తే ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజా పూల రేకులను తినవచ్చు.
 
డైరక్టుగా కాకపోయిన పూల రేకులకు ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ఫలితం బరువు తగ్గుతారని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. రోజా పువ్వులను తింటే శరీరంలో మెటబాలిజం చక్కగా పనిచేస్తుంది. అంటే అన్ని అవయవాల పనితీరు మెరుగవుతుంది. 
 
రోజా రేకులను రోజూ గుప్పెడు తింటూ వస్తే అవి మన శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. తద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. అంతేకాక సహజంగానే వీటికి వీర్యవృద్ధిని పెంచే గుణముందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

రోజాలలో వుండే సి-విటమిన్ పాడైన కణాలు పునరుజ్జీవం పొందుతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మహిళల్లో రుతుస్రావ సమస్యలు ఉన్నవారు రోజాల రేకులను తింటే మంచిది. సంతాన సాఫల్య సమస్యలకు కూడా ఇవి చెక్ పెడతాయి. ఐతే రోజా పూల రేకులను బాగా కడిగిన తర్వాతే తినాలి.

ఎందుకంటే వాటిపై పురుగు మందులు చల్లుతుంటారు. మైగ్రేన్ తలనొప్పి వంటివి ఉన్నవారు రోజ్ ఆయిల్‌తో మర్దన చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. రోజా రేకులతో తయారు చేసే కషాయం కూడా ఆరోగ్యానికి మంచిదే.