బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (17:44 IST)

ఒత్తిడికి బైబై చెప్పేసే ఆహార పదార్థాలేంటి?

stress
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. ఈ ఒత్తిడి సమస్యను తగ్గించి, మంచి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించే కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు చూద్దాం. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
 
చిక్‌పీస్, ఆకుకూరల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. క్యారెట్‌తో సహా కూరగాయలను సలాడ్‌గా తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోన్ అనే రసాయనం మంచి నిద్రను కలిగించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
 
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. సోయా బీన్స్‌లో ట్రిప్టోన్ ఉంటుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సోయా ఉత్పత్తులను తినవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.