Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

టాబ్లెట్స్ ఇలా వేసుకోరాదు... ఏమవుతుందంటే?

Written By సిహెచ్
Updated: గురువారం, 4 ఆగస్టు 2022 (22:59 IST)
అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. నారింజ లేదా నిమ్మరసంతో కలిపి కొందరు మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 

 
నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం తటస్థీకరిస్తుంది. కనుక అలా చేయరాదు.

 
పాల ఉత్పత్తులు శరీరంలో విభిన్నమైన ప్రక్రియలకు కారణమవుతాయి. యాంటీబయాటిక్స్ తీసుకుంటూ వాటితో పాటు పాలు తాగుతూ ఉంటే పాలలోని కాల్షియం, మెగ్నీషియం ఔషధం యొక్క ప్రభావాన్ని పరిమితం చేస్తాయి. కనుక యాంటీబయాటిక్ మందులను అలా తీసుకోరాదు.
 
కొందరు నిద్రపట్టేందుకు మాత్రలు వేసుకుంటుంటారు. అలాంటివారు ఆ స్లీప్ మెడిసిన్‌తో డార్క్ చాక్లెట్ తినకూడదు. ఈ చాక్లెట్ నిద్రపోయే ఔషధాన్ని పూర్తిగా తటస్థీకరిస్తుంది. ఫలితంగా రక్తపోటు బాగా పెరుగుతుంది.

అన్నీ చూడండి

పెళ్లయిన మూడో రోజే భర్త - అత్త మామల హత్యకు భోజనంలో విషం పెట్టిన భార్య

'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పేలిన పవర్ బ్యాంక్.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం (వీడియో)

పవన్ అన్నా.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది : రాకోట గ్రామ మహిళలు

జిబూటి తీరంలో మునిగిన పడవ - 109 మంది జలసమాధి

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments