కేశాలు బలంగా పెరగాలంటే ఈ పదార్థాలు తీసుకోవాలి
కాయధాన్యాలు తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన కేలరీలు, ప్రోటీన్ కలయిక ఆరోగ్యానికి, జుట్టుకు ప్రయోజనకరం. అందుకే జుట్టు రాలడం తగ్గాలంటే పప్పు తినండి.
వెంట్రుకలు రాలిపోయే వారికి సోయాబీన్స్ చాలా ముఖ్యమైన ప్రోటీన్ వనరులలో ఒకటి. సోయాబీన్స్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్స్‌లో ఐరన్, జింక్ మరియు ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు, వాటిని బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయి.
చాలా మంది మాంసాహారాన్ని తీసుకుంటారు. మాంసంలో ప్రోటీన్‌తో సహా వివిధ అదనపు పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు, జుట్టు మూలాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి జుట్టు రాలడాన్ని ఆపడానికి, సప్లిమెంట్లకు బదులుగా మాంసం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటుండాలి.