గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (23:42 IST)

నిద్రలో ఆ దశ చాలా ముఖ్యం, ఎందుకని?

రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా శరీరాంగాలు సక్రమంగా పనిచేయడమే కాకుండా.. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

 
నిద్ర మొదటి దశలో మంచిగా రాత్రి నిద్రపోవాలి. ఈ దశ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. రెండో దశ తేలికపాటి నిద్ర.. ఇందులో శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది.. కంటి కదలిక ఆగిపోతుంది. ఈ దశ 10-25 నిమిషాలు ఉంటుంది.

 
మూడో దశ స్లో వేవ్ స్లీప్ అంటారు.. మూడో దశ నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి చాలా అవసరం. నిద్ర లేకపోవడం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అశాంతికి దారితీస్తుంది. కనుక స్వల్పకాలిక నిద్ర వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.