శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (23:06 IST)

రాత్రిపూట పాలు తాగితే నిద్రపడుతుందా?

పాలలోని కొన్ని సమ్మేళనాలు - ప్రత్యేకంగా ట్రిప్టోఫాన్, మెలటోనిన్ నిద్రపోవడానికి సహాయపడవచ్చు. ట్రిప్టోఫాన్ అనేది వివిధ రకాల ప్రోటీన్ కలిగిన ఆహారాలలో కనిపించే అమైనో ఆమ్లం. సెరోటోనిన్ అని పిలువబడే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తిలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రాత్రివేళ నిద్రపోయేందుకు సాయపడుతుంది.

 
బాగా నిద్ర పట్టాలంటే బాదములు కూడా తినవచ్చు. వీటిని తింటే నిద్రలేమితో బాధపడేవారు నిద్ర వచ్చేట్లు చేస్తుంది. అలాగే నిద్రపట్టాలంటే.. యోగా, మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేస్తుండాలి. పగటిపూట నిద్రకు దూరంగా ఉండాలి. ఇలాంటివి ఆచరిస్తే రాత్రిపూట నిద్ర హాయిగా పడుతుంది.