ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 6 జనవరి 2022 (23:10 IST)

నిద్ర సరిపడనంత లేకపోతే ఏమవుతుందో తెలుసా?

ఒక రోజు నిద్రచాలకుంటే ఆ రోజంతా చాలా చిరాకుగా ఉంటుంది. పనిలో కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతాం. అయితే ఇలా నిద్రలేమి వల్ల మనుషుల మధ్య బంధాలు తెగే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనుషుల్లో చిరాకు ఎక్కువై దాని ప్రభావం వల్ల తగాదాలు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 
అమీ గోర్డాన్‌ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో నిద్రలేమి కారణంగా మనుషుల మధ్య ఏర్పడే సమస్యల గురించి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న జంటలను కొన్ని వారాల పాటు గమనించారు. 

 
వీరి పరిశీలనలో నిద్రలేమి వల్ల చిన్న చిన్న విషయాలపై కూడా అనవసరంగా తగాదాలు చోటుచేసుకుంటాయని తేలింది. దంపతుల మధ్య నిద్రలేమి కారణంగానే ఇలాంటి తగాదాలు చోటుచేసుకుంటాయని, అంతేకాకుండా నిద్రలేమి వల్ల ఆరోగ్యం కూడా పాడౌతుందని, చిరాకుతో  నిద్రలేమి అనుబంధాలపై ప్రభావం చూపి బాంధవ్యాలు దెబ్బతీసే పరిణామాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.