శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (19:57 IST)

ఆహారంలో చిక్కుడును చేర్చండి.. వ్యాధుల్ని దూరం చేసుకోండి..

Broad Beans
మనం తరచుగా మన ఆహారంలో చిక్కుడు కాయను జోడిస్తే, మన శరీరంలో శ్వాస సంబంధిత సమస్యలు ఉండవు. వారానికి కనీసం రెండుసార్లు ఆహారంలో చిక్కుడు కాయను జోడించడం మంచిది. మీరు క్రమం తప్పకుండా తిన్నప్పుడు, కఫం, పైత్యరస సంబంధిత వ్యాధులను వదిలించుకుంటారు. 
 
చిక్కుడులో ఇనుము సమృద్ధిగా వుంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నిజానికి రక్తశుద్ధి ద్వారా చర్మ వ్యాధులతో సహా అనేక వ్యాధులను నివారించవచ్చు. మధుమేహం ఉన్న వ్యక్తులు, అవయవాల తిమ్మిరి మొదలైన వాటితో ఇబ్బంది పడే వారు చిక్కుడు కాయను వారానికి మూడుసార్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆర్థరైటిస్ నొప్పికి ఇది ఒక అద్భుతమైన ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది.
 
నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు చిక్కుడును తీసుకోవచ్చు. ఇది ప్రధానంగా మెదడును బలోపేతం చేస్తుంది. జ్ఞాపకశక్తిని చిక్కుడు మెరుగుపరుస్తుంది. తద్వారా తెలివితేటలను పెంచడానికి సహాయపడుతుంది. చిక్కుడును తినడం కొనసాగిస్తే నిద్రలేమి పరారవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.