శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (22:28 IST)

శీతాకాలంలో బాదములతో చేసిన ఈ స్వీట్ తీసుకుంటే?

బాదాములలో ప్రోటీన్లు, మంచి కొవ్వులతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రిబోఫ్లావిన్, ఎల్-కార్టైన్ వుండటం వల్ల ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తీవ్రమైన మెదడు వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ శీతాకాలంలో బాదం హల్వా స్వీట్ చేసుకుని తింటుంటే రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

 
కావలసిన పదార్థాలు: 
బాదం: రాత్రంతా నానబెట్టి గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ ఒక కప్పు 
పంచదార: రుచికి తగినంత
పాలు: ఒక కప్పు 
నెయ్యి: అర కప్పు
నానబెట్టిన కుంకుమ పువ్వు కాసింత 

 
తయారీ విధానం: 
ముందుగా డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలా చేస్తే హల్వా పాన్‌కు అంటుకోదు. తర్వాత అదే పాన్‌లో ముప్పావు శాతం నీరు పోసి మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో పంచదార వేసి కరిగే వరకూ కలియబెట్టాలి.

 
అందులో బాదం పేస్ట్, మిగిలిన పాలు, కుంకుమపువ్వు కూడా వేసి మధ్యస్తం మంట మీద ఉడికించాలి. మొత్తం మిశ్రమాన్ని అడుగు అంటకుండా కలుపుతూ వుండాలి. ఇలా ఈ మిశ్రమం ఉడుకుతూ చిక్కబడ్డాక మిగిలిన నెయ్యి కూడా పోసి మరో 10 నిముషాలు ఉడికించాలి.   

 
నెయ్యి పూర్తిగా హల్వా గ్రహిస్తుంది. తర్వాత పాన్ చివర్ల కూడా అంటుకోకుండా చేస్తుంది. అప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత మరికొద్దిగా నెయ్యి వేయడం వల్ల బాదం హల్వా చాలా సాఫ్ట్‌గా మారుతుంది. ఈ హల్వాను మీకు నచ్చిన షేఫ్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.