ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (15:34 IST)

రోటీ, ఇడ్లీలలో ఈ చట్నీ వేసుకుంటే బరువు తగ్గుతారు..

ఇడ్లీలు, రోటీల్లో నూనె ఎక్కువగా ఉండే చట్నీలు, పచ్చళ్లు ఉపయోగిస్తున్నారా? దీనివల్ల బరువు పెరిగిపోతారని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలంటే.. పుదీనా, కొత్తిమీర చట్నీ కంటే మించిన ఔషధం లే

ఇడ్లీలు, రోటీల్లో నూనె ఎక్కువగా ఉండే చట్నీలు, పచ్చళ్లు ఉపయోగిస్తున్నారా? దీనివల్ల బరువు పెరిగిపోతారని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలంటే.. పుదీనా, కొత్తిమీర చట్నీ కంటే మించిన ఔషధం లేదంటున్నారు. పుదీనా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. పొట్టలోని గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి. 
 
అలాగే కొత్తిమీరలోనూ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. అందుచేత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లి, అల్లం, జీలకర్రను దోరగా వేపి.. వాటిని మిక్సీలో పచ్చడిలా రుబ్బుకుని అందులో నిమ్మరసం వేయాలి. ఆ పేస్టులో చిటికెడు ఉప్పు కూడా చేర్చుకోవాలి. 
 
ఈ చట్నీని రోటీలు, ఇడ్లీలలో నంజుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. తద్వారా తీసుకున్న ఆహారం జీర్ణమై కొవ్వుగా మారిపోకుండా పుదినా నియంత్రిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ డైట్‌లో అల్లం టీ, గ్రీన్ టీలను కూడా చేర్చుకోవాలి. రోజుకు రెండు బాదం పప్పులు తీసుకోవాలి.