శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (15:13 IST)

మాంసాహారాన్ని మానేస్తే ఎంత మేలో తెలుసా?

మటన్, చికెన్ లాంటి మాంసాహారం తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. గుండె పనితీరు మందగిస్తుంది. ఒబిసిటీ తప్పదు. ఈ కారణంగా గుండెకు చేరే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. బ్రాయిలర్ చికెన్‌ను తీసుకోవడం ద్వారా కాలేయానికి ముప్పు ఏర్పడుతుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. 
 
మహిళలు బ్రాయిలర్‌ చికెన్‌ను అధికంగా తీసుకుంటే.. గర్భాశయ సమస్యలు ఏర్పడుతాయి. ఇంకా మద్యం సేవించే వారు చాలామంది సైడిష్ కోసం నాన్ వెజ్ వంటకాలను తెగ లాగించేస్తుంటారు. దీనివలన కొలెస్ట్రాల్‌తో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇంకా పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయి.
 
ఇంకా మాంసాహారం తీసుకోవడం ఏర్పడే అనారోగ్య సమస్యలు ఏంటంటే? ఒబిసిటీ, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం, హృద్రోగాలు, ఊపిరితిత్తుల్లో వాపు, పక్షవాతం, రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటివి. మాంసాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. నాన్ వెజ్ తీసుకోకపోతే.. ఆ వేడి తగ్గుతుంది. అధిక శ్రమకు తర్వాత శాకాహారం, మాంసాహారం తీసుకుంటే కేలోరీలు కరిగిపోతాయి. 
 
కానీ కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారు శాకాహారాన్ని అధికంగా తీసుకుని మాంసాహారాన్ని మితంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా శాకాహారం తీసుకునేవారు రోజువారీ డైట్‌లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు తీసుకోవడం చేయాలి. ఇలా చేస్తే మాంసాహారానికి ధీటుగా పోషకాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.