గురువారం, 7 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 26 అక్టోబరు 2021 (23:54 IST)

చుండ్రును వదిలించుకునే మార్గం ఏంటి?

చుండ్రుకు జీన్స్, చర్మతత్వాలు అంతర్గతంగా ప్రధాన పాత్ర వహించే కారణాలు. ఇతర బాహ్యకారణాలు చర్మ పరిస్థితిని తీవ్రతరం చేస్తాయి. సాధారణ ఆరోగ్య స్థితిగతులు చుండ్రుకు దారితీస్తాయన్నది నిపుణుల అభిప్రాయం.
 
ఎలా నివారించాలి:
నిజం చెప్పాలంటే చుండ్రు నివారణకు ప్రత్యేక చికిత్స లేదు. చుండ్రును నియంత్రించే ఉద్దేశ్యంతో రూపొందించిన షాంపూలు చర్మ పరిస్థితిని నియత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. షాంపూను తలకు పట్టించి, మరగ వచ్చేవరకు రుద్ది కడిగేయడం వల్ల ఎటువంటి ఫలితమూ వుండదు. మాడుపై షాంపూ అప్లయ్ చేశాక కనీసం ఏడెనిమిది నిమిషాలు అలా ఉంచేసుకుని కడగాలి. దీనివల్ల యాంటీ ఫంగల్ లక్షణాలు బాగా పనిచేస్తాయి.
 
ఎందుకు తొలగించాలి:
చుండ్రువల్ల జుట్టురాలిపోతుంది. ముఖం, వీపు, మెడమలపై మొటిమలకు కారణమయ్యే అవకాశం ఉంది. చుండ్రుతోపాటు ముఖంపై అవాంఛిత రోమాలు, స్థూలకాయం, పాలిసిస్టిక్ ఓవరియస్ సిండ్రోమ్ వుందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.
 
చుండ్రుతో తరచూ ఇబ్బందిపడే వారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీడాంట్రఫ్ షాంపూ వాడకూడదు. చాలా మంది స్త్రీ, పురుషులకు వేర్వేరు షాంపూలుంటాయని అంటుంటారు. కాని ఇది నిజంకాదు. చుండ్రుకు లింగవివక్ష వుండదు. చికిత్స ఎవరికైనా ఒక్కటే.