1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (09:02 IST)

చుండ్రును తగ్గించుకోండిలా..

వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. డాండ్రఫ్ పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది.

రెండు గుపిళ్ల నిండుగా వేపాకు తీసుకొని 4-5 కప్పుల వేడి నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోండి. మిగిలిపోయిన వేపాకులను పేస్ట్‌గా చేసుకొని మాడుకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.