శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 ఏప్రియల్ 2021 (21:21 IST)

శీకకాయతో చుండ్రును వదిలించుకోవచ్చు, ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు

ఆయుర్వేదంలో శీకకాయకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఇది చుండ్రును నివారించడంలో ఎంతగానో సాయపడుతుంది. చుండ్రు నెత్తి మీద చికాకు పెట్టకుండా శుభ్రపరచడానికి శీకకాయ యాంటీ చుండ్రు ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది.
 
నెత్తి మీద అధికంగా నూనె రావడం వల్ల వచ్చే దీర్ఘకాలిక చుండ్రును నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. శీకకాయని పూయడం వల్ల నెత్తి మీద నుండి అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు చుండ్రును అది నియంత్రిస్తుంది.
 
 5 నుంచి 10 చుక్కల శీకకాయ ఆధారిత నూనె తీసుకోండి. నెత్తి మీద.. అంటే మాడుకు తగిలేట్లు పూయండి. అలా రాత్రిపూట వదిలివేయండి. మరుసటి రోజు జుట్టును మూలికా లేదా శీకకాయ ఆధారిత షాంపూతో కడగాలి. ఈ విధానాన్ని వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే ఫలితం వుంటుంది.