శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (20:20 IST)

కరోనా కాలం.. అల్లంను తప్పకుండా వాడాలట..!

కరోనా కాలంలో అల్లంను తప్పకుండా వాడటం మంచిది. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అల్లం ర‌సాన్ని రోజూ సేవిస్తుంటే కొన్ని రోజుల‌కు బ్ల‌డ్ షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
 
అల్లంను కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అందుకు నిత్యం అల్లం ర‌సాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే సేవించాలి. రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది. ర‌క్త‌ నాళాలలో ర‌క్తం గడ్డకట్టనీయకుండా అల్లం సహాయపడుతుంది. 
 
అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరే ప్రమాదకర బ్యాక్టీరియాల‌ను సంహరిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తొలగించ‌డంలో అల్లం మెరుగ్గా ప‌నిచేస్తుంది. నిత్యం అల్లం ర‌సం సేవించ‌డం వ‌ల్ల అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.