సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (23:27 IST)

వేప చెక్కపొడితో చర్మరోగాలకు చెక్... ఎలాగంటే?

వేపచెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనారోగ్యాలు కలిగినప్పుడు ఇంటి గుమ్మం వద్ద, రోగి పడక వద్ద వేపాకులు వుంచుతుంటారు. శరీరం పైన ఎక్కడైనా దురదలు వస్తే వేపాకు వేసి కాచిన నీటితో స్నానం చేస్తారు. వేప పుల్లతో దంతధావన చేయడం భారతీయుల జీవన విధానంలో ఒక భాగం.
 
 అందువల్ల మన భారతీయులలో మధుమేహ తీవ్రత ప్రస్తుతం వున్నంత ఎక్కువగా వుండేది కాదు. వేపతో దంతధావనం చేయడం వల్ల నోట్లో శ్లేష్మదోషం తగ్గి నాలుకకు రుచి తెలుస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయి. వేప ఆకులు, బెరడు, పువ్వులు, కాయలు, గింజలు, వేర్లు, వేప బంక తదితర వేప ఉత్పత్తులన్నీ ఔషధగుణాలతో నిండి వుంటాయి.
 
రక్తశుద్ధి జరగాలంటే వేప చెక్కపొడి, బావంచాల పొడి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజూ ఒకసారి రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనె లేదా 50 మి.లీ నీటిలో కలిపి సేవించడం వల్ల ఫలితం వుంటుంది. చర్మరోగాలు తగ్గిపోతాయి.