మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (11:46 IST)

మౌనవ్రతం చేస్తే లాభం ఏమిటి? మాట ఎలా ఉండాలంటే.. మందుమాత్రలా ఉండాలి.

కొంతమంది అదేపనిగా మాట్లాడుతూనే వుంటారు. వాగుడుకాయలా మాట్లాడుతూనే ఉంటే.. సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి ఒకసారి మౌనంగా ఉండేందుకు మౌనవ్రతం చేస్తే ఆయుష్షును పెరుగుతుందన

కొంతమంది అదేపనిగా మాట్లాడుతూనే వుంటారు. వాగుడుకాయలా మాట్లాడుతూనే ఉంటే.. సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి ఒకసారి మౌనంగా ఉండేందుకు మౌనవ్రతం చేస్తే ఆయుష్షును పెరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. ఎప్పుడూ వాగుతూ ఉండేవారి కన్నా తక్కువ మాట్లాడేవారు ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధకులు అంటున్నారు. 
 
నిశ్శబ్ధంగా ఉండటం ద్వారా కొన్ని రకాల జీన్స్ ఉత్తేజితం అవుతాయని, ఇవి ఆయుష్షును పెంచేందుకు కారణమవుతాయని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ కి చెందిన బక్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఏజింగ్‌ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకునే వారిలో ఈస్ట్‌ కణాలు ఎక్కువకాలం జీవించి ఉంటాయని దీని ద్వారా ఆరోగ్యంతో పాటు ముసలితనం త్వరగా ఆవహించదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే మౌనంగా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు వైద్యులు. 
 
ఆధ్యాత్మికంగా పరంగా వాక్కుకు దండం మౌనం.. మనస్సుకు దండం ధ్యానం. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. తప్పు మాట్లాడకుండా ఉండాలి.. తక్కువగా మాట్లాడాలి. మాట ఎలా ఉండాలంటే మందుమాత్రలా ఉండాలి. కొద్దిగా మాట్లాడాలి. గొప్పభావం ఉండాలి. మౌనంగా ఉండటం వల్ల మనస్సు పవిత్రంగా ఉండాలి. మౌనవ్రతం చేయడం ద్వారా మనస్సు, శరీరం పవిత్రమవుతుంది.
 
దీర్ఘాయుష్షు, కీర్తి, సంపద, గౌరవ మర్యాదలు చేకూరుతాయి. సత్యం మాట్లాడటం కూడా మౌనమే. చెడు మాటలు మాట్లాడకూడదు. వారానికి ఓసారి లేదా మాసానికి ఓసారి మౌన వ్రతం పాటించడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పంచజ్ఞానేంద్రియాలకు విశ్రాంతి ఇవ్వడమే మౌనవ్రతం. మౌనవ్రతం వల్ల వాక్‌శుద్ధి చేకూరుతుంది. వాక్‌సిద్ధి చేకూరుతుంది. కోపం, ఆవేశం, రోగాలను మౌనవ్రతం దూరం చేస్తున్నాయి. మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. అశాంతి ఉండదు. సమస్యలు పరిష్కారమవుతాయి. కోపతాపాలను మౌనవ్రతం నియంత్రిస్తుంది.