సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (16:38 IST)

అత్యంత అరుదైన స్టేజ్ 4 న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్ రోగికి అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

image
అరుదైన, తీవ్రమైన స్టేజ్ 4 న్యూరోఎండోక్రైన్ కార్సినోమాతో బాధపడుతున్న 42 ఏళ్ల వినుకొండ మహిళకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) మంగళగిరి విజయవంతంగా చికిత్స చేసింది. రోగి గణనీయమైన బరువు తగ్గడం (3 నెలల్లో 10 కిలోలు), ఆకలి లేకపోవడం, సుదీర్ఘమైన మలబద్ధకం వంటి సమస్యలతో AOI మంగళగిరిలో వైద్య చికిత్స కోసం వచ్చారు. ఆమెను పరీక్ష చేసిన తర్వాత, ఆమె సిగ్మోయిడ్ కోలన్‌లో అల్సెరోప్రొలిఫెరేటివ్ పెరుగుదలతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది, బయాప్సీ ద్వారా గ్రేడ్ 3 న్యూరోఎండోక్రిన్ కార్సినోమాగా నిర్ధారించబడింది.
 
సమగ్ర రోగనిర్ధారణ పరీక్షలలో సిగ్మోయిడ్ కోలన్ స్టేజ్ 4 న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్ నిర్ధారణను చేస్తూనే, కాలేయ గాయాలను కూడా వెల్లడించింది. అడ్మిషన్ సమయంలో, రోగి పూర్తి  బలహీనంగా ఉండటంతో పాటుగా, పొత్తికడుపు పెరగడం, రెండు కాళ్లలో వాపు, విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నారు. దానితో ఆమె 50% సమయాన్ని మంచానికే పరిమితం చేశారు. 
 
ఈ సంవత్సరం జూలైలో చికిత్స ప్రారంభించి, AOI మంగళగిరి యొక్క మెడికల్ ఆంకాలజీ బృందం పాలియేటివ్ కెమోథెరపీ యొక్క మొదటి సైకిల్‌ను నిర్వహించింది. అయినప్పటికీ, రోగి చికిత్స సమయంలో ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ అని పిలువబడే క్లిష్టమైన ఆంకోలాజికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొన్నారు. ఈ సిండ్రోమ్ కారణంగా అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్, పొటాషియం, క్రియేటినిన్ పెరిగింది. మూత్రపిండ వైఫల్యానికి దారితీసింది.
 
మెడికల్ డైరెక్టర్ & సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్. సుబ్బారావు, AOI మంగళగిరిలోని కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సృజన జోగా మాట్లాడుతూ, "న్యూరోఎండోక్రైన్ కార్సినోమాలు వాటి తీవ్ర స్వభావం కారణంగా గణనీయమైన సవాళ్లను విసురుతున్నాయి. సమగ్రమైన ముందు, అనంతర కెమోథెరపీ నిర్వహణ వ్యూహం, సమస్యల ఎదురైన సమయంలో సత్వర జోక్యం ద్వారా  మేము ఈ రోగి చికిత్స పరంగా విశేషమైన రీతిలో సానుకూల ప్రతిస్పందనను సాధించాము" అని అన్నారు.
 
ఖచ్చితమైన సంరక్షణ, సత్వర జోక్యం ద్వారా, వైద్య బృందం సిండ్రోమ్‌ను సమర్థవంతంగా నిర్వహించింది. కీమోథెరపీ చేసిన 10 రోజులలో, రోగి కాలు వాపు తగ్గడం, పొత్తికడుపు నొప్పి, విస్తరణ తగ్గడం, మూత్రపిండాల పనితీరును సాధారణీకరించడంతో గణనీయమైన మెరుగుదలని అనుభవించారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, "AOI మంగళగిరిలో ఈ అరుదైన స్టేజ్ 4 న్యూరోఎండోక్రిన్ కార్సినోమా కేసుకు విజయవంతంగా చికిత్స అందించడం, క్యాన్సర్ కేర్‌లో మా శ్రేష్ఠతను తెలియజేస్తుంది. మా మల్టీడిసిప్లినరీ విధానం, వ్యక్తిగతీకరించిన రోగి సంరక్షణ, అత్యాధునిక చికిత్సలు, క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి, రోగులు మరియు వారి కుటుంబాలకు ఆశను పునరుద్ధరించాలనే  మా నిబద్ధతను ఉదహరిస్తుంది" అని అన్నారు.
 
చికిత్స సమయంలో, రోగి ఆరు సైకిల్స్  కీమోథెరపీని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నవంబర్, 2023లో PET-CT స్కాన్ ద్వారా చేసిన తదుపరి పరీక్షలలో వ్యాధి దాదాపుగా నిష్క్రియాత్మకంగా కనిపించింది. కొనసాగుతున్న సంరక్షణ ప్రణాళికలో భాగంగా ఆమె నోటి మాత్రల ద్వారా  కీమోథెరపీకి మార్చబడింది. AOI మంగళగిరి అధునాతన, వ్యక్తిగతీకరించిన ఆంకోలాజికల్ కేర్‌ను అందించడం, క్యాన్సర్‌తో పోరాడటం మరియు రోగి ఫలితాలను మెరుగుపరచడంలో దాని నిబద్ధతను పునరుద్ఘాటించడంపై దృష్టి సారిస్తుంది.