గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 నవంబరు 2023 (22:04 IST)

క్యాన్సర్ కణితి అనాప్లాస్టిక్ ఎపెండిమోమా: 3 ఏళ్ల చిన్నారికి అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

child
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (AOI) గుంటూరులో గ్రేడ్ 3 CNS ట్యూమర్ అయిన అనాప్లాస్టిక్ ఎపెండిమోమాతో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించింది. కేంద్ర నాడీ వ్యవస్థను అనాప్లాస్టిక్ ఎపెండిమోమా ప్రభావితం చేస్తుంది. తలనొప్పి, వికారం, వాంతులు, అవయవాల బలహీనత వంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది.
 
ఈ చిన్నారికి అడపాదడపా తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ చిన్నారి ఎంఆర్ఐ మెదడు పరీక్షలను చేసినప్పుడు, మెదడు వెనుక భాగంలో 5*4.4 సెం.మీ పరిమాణంలో ఉన్న కణితిని గుర్తించారు. ఈ ప్రాంతం మెదడులోని ముఖ్యమైన భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. మెదడు, వెన్నుపాము లోపల సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) యొక్క సంతులనం, ప్రసరణపై ప్రభావితం చేసే రీతిలో ఈ కణితి ఉందని గుర్తించారు. 
 
AOI లోని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డాక్టర్ కె. సుధాకర్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం, డాక్టర్ సాయి బాబు, అనస్థీషియాలజీ మద్దతుతో, GGHలో ఎక్సిషన్ సర్జరీ నిర్వహించారు. హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్ (HPE) అనాప్లాస్టిక్ ఎపెండిమోమా గ్రేడ్ 3ను నిర్ధారించింది. శస్త్రచికిత్స తర్వాత, మరొకసారి చేసిన మెదడు స్కాన్‌తో ఈ కణితి ఏర్పడిన అసాధారణ ప్రాంతం చాలా వరకూ కుంచించుకుపోయిందని చూపించింది, ఇప్పుడు 1.7 సెం.మీ. X 8 మిల్లీమీటర్లుగా అది వుంది. ఈ చిన్నారి తల వెనుక కణజాలంలో కొంత ద్రవాన్ని కూడా గమనించారు, అది సుమారు 4.3X2.4 సెం.మీ.గా వుంది. 
 
రేడియేషన్ థెరపీని అందించడంలో ఖచ్చితత్వానికి ప్రసిద్ధి చెందిన అత్యాధునిక హాల్సియోన్ లీనియర్ యాక్సిలరేటర్‌ను ఉపయోగించి, వైద్య నిపుణుల బృందం మెదడు కాండం, ఆప్టిక్ నర్వ్ మరియు టెంపోరల్ లోబ్ వంటి పరిసర కీలక అవయవాలకు (OARs) ప్రమాదం లేకుండా లేకుండా, ఈ  రేడియేషన్ ప్రభావానికి బహిర్గతం కాకుండా కణితి ప్రాంతాన్ని సమర్థవంతంగా లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించారు. సంభావ్య న్యూరోకాగ్నిటివ్ మరియు ఎదుగుదలపై ప్రభావాలను తగ్గించడానికి పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకుంటే ఈ వ్యూహాత్మక విధానం చాలా కీలకమైనది.
 
AOI వద్ద కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. సుధాకర్ మాట్లాడుతూ, "అనాప్లాస్టిక్ ఎపెండిమోమాతో బాధపడుతున్న ఈ చిన్నారికి  హాల్సియోన్ లీనియర్ యాక్సిలరేటర్ వంటి అధునాతన సాంకేతికతలతో విజయవంతమైన చికిత్సను ఖచ్చితమైన మరియు అనుకూలమైన రేడియేషన్ థెరపీని అందించడంలో వాటి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. క్లిష్టమైన అవయవాలు రేడియేషన్ ప్రభావానికి గురికావడాన్ని తగ్గించడం,  చికిత్స తర్వాత మెరుగైన జీవన నాణ్యతను అందించడం ద్వారా న్యూరోకాగ్నిటివ్ మరియు అభివృద్ధి పరంగా అవాంతరాల ప్రమాదాన్ని తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు. 
 
AOI రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (RCOO), శ్రీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, "అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో మేము అసమానమైన  రీతిలో చికిత్సను అందించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నైపుణ్యం కలిగిన వైద్య నిపుణుల బృందం పై ఆధారపడుతున్నాము. ఈ చిన్నారికి విజయవంతమైన చికిత్స సానుకూల రోగి ఫలితాలను సాధించడంలో మరియు సవాలుతో కూడిన కేసులను ఎదుర్కోవడం పరంగా పురోగతి సాధించడంలో మా నిబద్ధతను సూచిస్తుంది" అని ఆన్నారు. 
 
చికిత్స తర్వాత, రోగి అద్భుతమైన పురోగతిని చూపించారు. ఆమె ఎటువంటి అభివృద్ధి అసాధారణతలు లేకుండా చురుకుగా తన విద్యా కార్యకలాపాలలో నిమగ్నమైంది, చికిత్స తర్వాత అద్భుతమైన రీతిలో కోలుకున్నట్లు గా ఇది వెల్లడిస్తుంది. గుంటూరులో ఉన్న బొమ్మిడాల క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటి, ఈ ప్రాంతంలో క్యాన్సర్ చికిత్స సేవలను విస్తృత శ్రేణిలో అందిస్తోంది. ఇంటర్నేషనల్ ట్యూమర్ బోర్డ్ యొక్క ఎలైట్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో గర్వించదగిన సభ్యుడిగా, గుంటూరులోని AOI ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులతో సన్నిహితంగా కలిసి పనిచేస్తుంది, మా రోగులు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యంత అధునాతనమైన మరియు సమాచారంతో కూడిన చికిత్స  అవకాశాలను పొందగలరని భరోసా అందిస్తున్నాము.