గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (09:11 IST)

మరో రెండు కొత్త కరోనా లక్షణాలు ప్రకటించిన ఏపీ సర్కారు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఈ వైరస్ అడ్డుకట్టకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ఫలితం మాత్రం నామమాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఇపుడు కొత్తగా మరో రెండు కరోనా లక్షణాలను ఏపీ సర్కారు వెల్లడించింది. 
 
కరోనా వైరస్ బారినపడిన వారికి జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇది వరకు నిర్ధారించారు. 
 
అయితే ఇప్పుడు తాజాగా కరోనా లక్షణాల్లో మరికొన్ని చేరినట్లు ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది. ఈ మేరకు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అనే సంస్థ కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి కీలక ప్రకటనను జారీ చేసినట్లు తెలిపింది. 
 
సీడీసీ ప్రకటన మేరకు... వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది. కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.