1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (18:27 IST)

ఫ్యామిలీ ప్లానింగ్: మగాళ్ల కెందుకు నిరాసక్తత?

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలంటే పురుషులు నిరాసక్తత చూపిస్తున్నారట. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల విషయంలో మగవారి నిరాసక్తత మరోసారి బయటపడింది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య 21 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. 
 
2012-14 మధ్య ఢిల్లీలో 43వేల మంది మహిళలు ట్యూబెక్టమీ చేయించుకున్నారు. అదే సమయంలో వేసక్టమీ చేయించుకున్న మగవారు కేవలం 2031 మాత్రమేనని గణాంకాల్లో తేటతెల్లమైంది. 
 
లైంగికపరమైన సమస్యలు ఎదురవుతాయన్న భయంతోనే చాలామంది పురుషులు వేసక్టమీ పట్ల ఆసక్తి చూపట్లేదని వైద్యనిపుణులు అంటున్నారు. ఇలాంటి భయాలన్నీ అర్థరహితమన వైద్యులు సూచిస్తున్నారు. శాశ్వత కుటుంబ నియంత్రణ వేసక్టమీయే సురక్షితమంటున్నారు.